ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన OG చిత్రాన్ని వీక్షించాలి అంటే జేబులకు చిల్లు పడాల్సిందే. OG బెన్ఫిట్ షో టికెట్ ధరను 1000 రూపాయలుగా నిర్ణయిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతేకాదు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది.
సింగిల్ స్క్రీన్ 125 రూపాయలు, మల్టిప్లెక్స్ లో 150 పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం OG మేకర్స్ కి అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది.
OG కి ప్రీమియర్స్ షోస్ లేకపోయినా.. బెన్ ఫిట్ షో సినిమా రిలీజ్ సెప్టెంబర్ 25 తెల్లవారుఝాము 1 గంటకి బెన్ఫిట్ షో కి అనుమతులు ఇవ్వడమే కాకుండా 1000 రూపాయల టికెట్ వసూలు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరి OG బెన్ఫిట్ షో చూడాలి అంటే 1000 రూపాయలు పెట్టాల్సిందే. 1000 రూపాయల బెన్ఫిట్ షో టికెట్ అంటే పవన్ ఫ్యాన్స్ జేబులకు చిల్లులు కాక ఇంకేం అవుతుంది.