నారా రోహిత్ లేటెస్ట్ మూవీ సుందరకాండ ఆగష్టు 27 వినాయకచవితి ఫెస్టివల్ స్పెషల్ గా విడుదలైంది. నారా రోహిత్, తమిళ నటి శ్రీదేవి నటించిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.
సుందరకాండ విడుదలై ఇంకా నెల కాలేదు. కేవలం 20 రోజులే అయ్యింది. ఇప్పుడు ఈచిత్రాన్ని డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ జియో ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ చెయ్యడానికి రెడీ అయ్యింది. సెప్టెంబర్ 23 నుంచి జియో హాట్ స్టార్ నుంచి సుందరకాండ ను స్ట్రీమింగ్ లోకి తేబోతున్నట్టుగా తెలుస్తుంది.
సో థియేటర్స్ లో మిస్ అయిన ఈ హిట్ మూవీ సుందరకాండ ను ఓటీటీలో అందులోను జియో హాట్ స్టార్ లో వీక్షించేందుకు సిద్దమైపొండి మరి.