పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ పదే పదే వాయిదా పడుతూ చివరికి వచ్చే ఏడాది జనవరి 9 కి షిఫ్ట్ అయ్యింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ షూటింగ్ పూర్తి కావొచ్చింది. అయితే ప్రభాస్ సరిగ్గా డేట్స్ ఇవ్వని కారణంగానే రాజా సాబ్ షూట్ లేట్ అయ్యి రిలీజ్ వాయిదా పడుతుంది అనే ప్రచారం ఉంది.
మరోపక్క రాజా సాబ్ సీజీ వర్క్ లేట్ కావడంతోనే రాజా సాబ్ విడుదల వాయిదా వార్తలను తాజాగా మిరాయ్ ఇంటర్వూస్ లో టిజి విశ్వప్రసాద్ చెప్పారు. సీజీ వర్క్ లేట్ అవుతూ ఉండడంతోనే రాజా సాబ్ వాయిదా అని చెప్పారు. పవన్-సాయి ధరమ్ తేజ్ బ్రో అప్పుడు VFX సరిగ్గా చెయ్యలేక ఫెయిల్ అయ్యామని..
కానీ మిరాయ్ కి మాత్రం అందుకే ఒక డివిజన్ మొదలుపెట్టి ఈ సినిమాకి మంచి గ్రాఫిక్స్ ఇచ్చాము. అంతేకాదు అది రాజా సాబ్ కోసం కూడా చేసాం. అందుకే రాజా సాబ్ రిలీజ్ డిలే అయ్యింది.. ఈ విషయంలో ప్రభాస్ కి స్పెషల్ థాంక్స్ అంటూ టిజి విశ్వప్రసాద్ మిరాయ్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు.