బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో చేసిన ఛత్రపతి రీమేక్ తర్వాత తెలుగులో బిగ్ బ్రేక్ తో భైరవం తో కమ్ బ్యాక్ అయ్యాడు. ఆ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా బెల్లంకొండ శ్రీనివాస్ కి మాత్రం మంచి పేరొచ్చింది. భైరవం తర్వాత చాలా తక్కువ గ్యాప్ అంటే కేవలం మూడు నెలల గ్యాప్ తో కిష్కిందపురి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు.
కిష్కిందపురి చిత్రం గత శుక్రవారం విడుదలయ్యింది. ఈ చిత్రానికి కూడా ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అదే మిరాయ్ చిత్రం గనక లేకపోతే ఫస్ట్ వీకెండ్ లోనే బెల్లంకొండ సేఫ్ అయ్యేవాడు. కానీ మిరాయ్ దూకుడు ముందు కిష్కిందపురి కాస్త డల్ అయ్యింది.
32 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కిష్కిందపురి కి నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 24 కోట్లు వచ్చేసినా బెల్లంకొండ సినిమాలకు హిందీ యూట్యూబ్ లో ఉన్న డిమాండ్, అలాగే థియేట్రికల్ బిజినెస్ రూపంలో మిగిలిన ఆ ఏడెనిమిది కోట్లు ఈపాటికే వచ్చేసే వుంటాయి. సో బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపరి సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్టే.
ఈ ఊపులోనే బెల్లంకొండ శ్రీనివాస్ టైసన్ నాయుడు మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఆ సినిమా షూట్ లో బెల్లంకొండ బిజీ అయ్యాడు.