యువ ఔత్సాహిక ఫిలింమేకర్స్ ని ఎగ్జయిట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బొనాంజా ఆఫర్ ప్రకటించింది. క్రియేటివిటీ ఉన్న 40 ఏళ్ల లోపు ఔత్సాహిక ఫిలింమేకర్స్ 3 నిమిషాలకు మించని లఘు చిత్రం లేదా 5 ని.లు మించని పాటలను రూపొందించి `బతుకమ్మ యంగ్ ఫిలింమేకర్స్ ఛాలెంజ్ -2025` పోటీలకు పంపాల్సిందిగా ప్రకటించింది. ఈ పోటీలో గెలుపొందిన వారికి లక్ష నుంచి మూడు లక్షల వరకూ గెలుచుకునే అవకాశం ఉంది. మొదటి బహుమతికి 3లక్షలు, రెండో బహుమతికి 2 లక్షలు, ఒకటో బహుమతికి 1లక్ష అందజేస్తారు. జ్ఞాపిక, ప్రశంసా పత్రం కూడా అందుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులు, సామాజిక వృద్ధికి సహకరించే కార్యక్రమాలపై లఘు చిత్రాలు లేదా పాటలను రూపొందించాల్సి ఉంటుంది. అయితే దీనికి కండిషన్స్ వర్తిస్తాయి.
అయితే ఈ అవార్డులను కేవలం తెలంగాణలో జన్మించిన వారికి మాత్రమేనా? హైదరాబాద్ సహా తెలంగాణలో సెటిలైన ఆంధ్రా క్రియేటర్లకు కూడా ఛాన్సుందా? అన్నదానిపై స్పష్ఠత లేదు. ఇది కేవలం తెలంగాణ ట్యాలెంటుకు మాత్రమే అనే బోర్డ్ అయితే పెట్టలేదు.
కేవలం తెలంగాణ స్థానికులకు మాత్రమే, సెటిలర్స్ కి అవకాశం లేదని మాత్రం ప్రకటించలేదు. దీనిపై అగ్ర నిర్మాత ఎఫ్.డి.సి ఛైర్మన్ దిల్ రాజు వివరణ ఇస్తారేమో చూడాలి. ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ తరపున, సీఎం రేవంత్ రెడ్డి తరపున ఈ పోటీలను నిర్వహిస్తున్నది ఆయనే గనుక దీనికి జవాబు కూడా ఆయనే చెప్పాలి. హైదరాబాద్ ఫిలింనగర్, కృష్ణానగర్ లో సెటిలైన ఆంధ్రా క్రియేటర్లకు ఈ పోటీలో పాల్గొనే ఆఫర్ వర్తిస్తుందా? వర్తించదా?