కుటుంబమంతా కలిసి చూడదగ్గ కంటెంట్ ను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందిస్తూ టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది ఈటీవీ విన్ సంస్థ. కథా సుధ పేరుతో వారానికో షార్ట్ మూవీని విడుదల చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంది. దీనిలో భాగంగా తను రాధే.. నేను మధు అనే కొత్త ఎపిసోడ్ ను విడుదల చేసింది.33 నిమిషాల నిడివి కలిగిన ఈ షార్ట్ మూవీ సెప్టెంబర్ 14 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. సీనియర్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆర్.పి.పట్నాయక్ ఈ తను రాధే.. నేను మధుని డైరెక్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. లక్ష్మీ దుర్గ కత్తి, జయవంత్ పసుపులేటి ప్రధాన పాత్రలు పోషించిన ఈ షార్ట్ మూవీలో ఋషి కిరణ్, శ్రీధర్ భూమిరెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు.
విదేశాల్లో జరిగిన ఓ యదార్థ సంఘటనను ఆధారం చేసుకుని ఈ షార్ట్ మూవీని తెరకెక్కించారు ఆర్.పి. స్వచ్ఛమైన ప్రేమలో నమ్మకం, సహనం,భావోద్వేగం వంటివి ఉంటాయని...వాటి లోతుని 33 నిమిషాల్లో తెలియజేస్తూ చాలా సెన్సిబుల్ గా ఈ షార్ట్ మూవీని రూపొందించారు. క్లైమాక్స్ అయితే అందరినీ భావోద్వేగానికి గురి చేసే విధంగా డిజైన్ చేశారు.
కొన్ని వందల సినిమా ఈవెంట్లను, సెలబ్రిటీ ఇంటర్వ్యూలను హోస్ట్ చేస్తూ స్టార్ స్టేటస్ సంపాదించుకుని దూసుకుపోతున్న యాంకర్ గీతా భగత్ తను రాధే.. నేను మధు తో నిర్మాతగా మారడం మరో విశేషంగా చెప్పుకోవాలి. రఘురాం బొలిశెట్టితో కలిసి ఈ షార్ట్ మూవీని నిర్మించారు గీతా భగత్. చిత్రీకరణ మొత్తం అమెరికాలోనే జరిగింది. క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. డిజిటల్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అద్భుతమైన వ్యూయర్ షిప్ ను దక్కించుకుని ట్రెండింగ్లో దూసుకుపోతుంది తను రాధే నేను మధు.