బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగుపెట్టిన కామనర్స్ సెలబ్రిటీస్ పై పైచెయ్యి సాదించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. మేము స్ట్రాంగ్ అంటూ వాళ్లలో వాళ్ళే గొడవపడుతున్నారు. ప్రియా, శ్రీజ, పవన్, మనీష్ ఇక మాస్క్ మ్యాన్ గురించి చెప్పక్కర్లేదు. హరిత హరీష్ అంటూ హౌస్ లోకి అడుగుపెట్టి మాస్క్ వేసుకుని కంటెస్టెంట్స్ తో ఆటాడుతున్న అతని నిజ స్వరూపాన్ని నాగార్జున శనివారం ఎపిసోడ్ లో కళ్ళకు కట్టినట్టు విప్పి చూపించారు.
దానితో హరిత హరీష్ హార్ట్ అయ్యి అన్నం తినడం మానేసాడు. ఎవ్వరు అడిగినా మీలాంటి వాళ్లతో నేను హౌస్ లో ఉండలేను, నన్ను బిగ్ బాస్ పంపిస్తే వెళ్ళిపోతా అనడంతో ఈ వీక్ నామినేషన్స్ లో హౌస్ మేట్స్ ముఖ్యంగా అతని గ్రూప్ సభ్యులైన మనీష్, శ్రీజ, పవన్ లకు టార్గెట్ అయ్యాడు. అతను టెంపర్ కోల్పోయేలా హౌస్ మేట్స్ అతన్ని రెచ్చగొట్టి వదిలారు.
ఇక అన్ సీన్ ఎపిసోడ్ లో తనూజ, రీతూ లు హరీష్ దగ్గరకు వెళ్లి మీరు మీ కోపాన్ని ఆటలో చూపించండి అన్నం పై కాదు అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తారు, అలాగే ఇంకొంతమంది అంటే రాము లాంటి వాళ్ళు హరీష్ ని తినమని అడిగారు. కానీ తిననై చెప్పాడు. అయితే గత రాత్రి హరీష్ తన నిరాహారదీక్షను బ్రేక్ చేసి ఫుడ్ తింటూ తనకు ఫుడ్ ఇచ్చిన తనూజ కు థాంక్స్ చెప్పిన కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.