యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకి ఫిట్ నెస్ విషయంలో మేకోవర్ విషయంలో అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ లో భీమ్ కేరెక్టర్ కోసం బరువు పెరిగిన ఎన్టీఆర్ దేవర చిత్రం కోసం మరింత ఫిట్ గా తయారయ్యారు. ఇక వార్ 2 కోసం ఎన్టీఆర్ స్పెషల్ ట్రైనర్ తో జిమ్ లో కష్టపడ్డారు.
ఇప్పుడు ప్రశాంత్ నీల్ డ్రాగన్ కోసం ఎన్టీఆర్ జిమ్ లో చమటలు చిందిస్తున్నారు. ఎన్టీఆర్ తాజా జిమ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఎన్టీఆర్ జిమ్ వీడియో చూసాక ఎన్టీఆర్ ఇంత కష్టపడుతున్నారు.. ఆయన కష్టానికి ఫలితం దక్కాల్సిందే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు.
ఎన్టీఆర్ జిమ్ లో కండలు చూపిస్తూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అద్దరగొట్టేసారు. ఎన్టీఆర్ బరువు తగ్గి మొహం లో కాస్త గ్లో కోల్పోవడం ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టినప్పటికీ సినిమా కోసం అంతలా మేకోవర్ అవడం పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ గా ఫీలవుతున్నారు.