Advertisementt

వీర చంద్రహాస విజయదరహసం

Wed 17th Sep 2025 10:55 AM
vijaya chandrahasa  వీర చంద్రహాస విజయదరహసం
Vijaya Chandrahasa Press Meet Highlights వీర చంద్రహాస విజయదరహసం
Advertisement
Ads by CJ

కంచి కామాక్షి కోల్‌కతా కాళీ  క్రియేషన్స్, ఎస్ జే కే బ్యానర్స్ పై ఎమ్‌వీ రాధాకృష్ణ, జేమ్స్ డబ్యూ కొమ్ము  తెలుగులో విడుదల చేస్తున్న కన్నడ చిత్రం వీర చంద్రహాస.  

మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్‌‌గా రాధాకృష్ణకు గుర్తింపు ఉంది. గతంలో శివరాజ్ కుమార్ నటించిన వేద, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన రాక్షస చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసిన ఆయన.. తాజాగా వీర చంద్రహాస తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నారు. సెప్టెంబర్ 19న తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని  ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా రవి బస్రూర్ మాట్లాడుతూ..ఇదొక రేటెడ్ స్టోరీ. యక్షగానం కల్చర్ ను రిప్రజెంట్ చేసేలా ఉంటుంది. ఈ సినిమా నా 12 సంవత్సరాల కల. విజయం సాధించిన ప్రతి ఒక్కరి స్టోరీ ఇది. జీరో నుంచి హీరోగా ఎలా అవుతారు అనే డెడికేషన్ ఈ కథలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది. ఒక సినిమా చేయడంతో సుమారు 4000 మందికి ఉపాధి కలుగుతుంది. మ్యూజిక్ చేయడంతో వచ్చే డబ్బును సరైన మార్గంలో ఉపయోగించాలనే ఉద్దేశంతో ఏడాదికి ఒక సినిమాను దర్శక నిర్మాతగా చేయాలనుకునే లక్ష్యం పెట్టుకున్నాను. ఇది నా ఆరో సినిమా. దీని ద్వారా కొత్త వాళ్లను ఎంకరే చేస్తాను. మనం ఏ స్థాయికి వెళ్ళినా అన్న మూలాలను మర్చిపోకూడదని నమ్ముతాను. 

యక్షగాన కలతో రూపొందిన ఈ చిత్రంతో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాను. మన కల్చర్ ను కాపాడుకునేలా ఈ చిత్రం ఉంటుంది. 

ఎనిమిదో తరగతి  ఫెయిల్ అయిన వాడిని, ఉగ్రం సినిమా వచ్చేవరకు నా జీవితంలో అన్ని డిజాస్టర్లే. నాకు అవకాశం ఇచ్చిన ప్రశాంత్ నీల్ గారు నాకు దేవుడితో సమానం. నన్ను నమ్మిన ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని అన్నారు. 

నిర్మాత ఎమ్.వీ.రాధాకృష్ణ మాట్లాడుతూ..ఇటీవల కన్నడలో విడుదలై అఖండ విజయం సాధించిన వీర చంద్రహాస వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో 100 డేస్ రన్ అయిన సినిమాగా వీర చంద్రహాస మంచి గుర్తింపును అందుకుంది. ఈ చిత్రాన్ని మేము తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదొక భారతీయ నాగరికత సంస్కృతికి సంబంధించిన.. యక్షగానం అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందింది. కే జి ఎఫ్, సలార్ లాంటి చిత్రాలకు తనదైన సంగీతంతో అలరించిన రవి బస్రూర్ గారు.. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే సంగీత దర్శకులుగా వ్యవహరించారు.  కన్నడలో పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను ఆదరిస్తుంది. వీర చంద్రహాస విజయదరహసం ఖాయమని నమ్ముతున్నాం అని అన్నారు. 

జేమ్స్ డబ్యూ కొమ్ము మాట్లాడుతూ..లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గారితో స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. మ్యూజిక్ కంటే నాకు చాలా ప్యాషన్. బెంగళూరు తో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి వచ్చిన సంగీత దర్శకుడితో వర్క్ చేయడం నాకు మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. రవి బస్రూర్ అంటే.. ఒక ఇన్స్టిట్యూషన్. ఆయన సొసైటీ మీద ప్రేమ ఉన్న వ్యక్తి. బస్రూర్ అనే విలేజ్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. అలాంటి వ్యక్తితో ట్రావెల్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 19 విడుదలవుతున్న ఈ చిత్రం కచ్చితంగా అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నాం అని చెప్పారు. 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్, పి ఆర్ ఓ హర్ష పాల్గొన్నారు. 

Vijaya Chandrahasa Press Meet Highlights:

Ravi Basrur Vijaya Chandrahasa

Tags:   VIJAYA CHANDRAHASA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ