గత శుక్రవారం విడుదలైన తేజ సజ్జ-కార్తీక్ ఘట్టమనేని కలయికలో వచ్చిన మిరాయ్ చిత్రం థియేటర్స్ లో సూపర్బ్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మొదటి వీకెండ్ లోనే కళ్ళు చెదిరే కలెక్షన్స్ తో అద్దరగొట్టిన మిరాయ్ ని ఇంకా ఇంకా ప్రేక్షకులకు చేరువయ్యేలా సక్సెస్ సెలెబ్రేషన్ నిర్వహిస్తున్నారు మేకర్స్.
గత రాత్రి జరిగిన మిరాయ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో నిర్మాత విశ్వప్రసాద్ హీరో తేజ సజ్జ కు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కాస్ట్లీ కారులు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నట్టుగా అనౌన్స్ చేసారు. ఇప్పుడు మిరాయ్ 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టినట్టుగా మిరాయ్ మేకర్స్ 100 కోట్ల పోస్టర్ ని అధికారికంగా వదిలారు.
మిరాయ్ కేవలం ఐదు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టినట్టుగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. దానితో తేజ సజ్జ 100 కోట్ల బొమ్మ మిరాయ్ అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి వారం తిరగకుండానే మిరాయ్100 కోట్ల క్లబ్బులోకి చేరడం మేకర్స్ ని సంతోషపెట్టే విషయమే కదా.!