ప్రస్తుతం మంచు హీరోలు మెల్లగా సక్సెస్ ట్రాక్ కాదు అసలైన దారిలోకి వస్తున్నారు. మంచు మనోజ్, మంచు విష్ణు నటనకు బిగ్ బ్రేక్ ఇచ్చేసారు. తొమ్మిదేళ్ల తర్వాత మంచు మనోజ్ భైరవం తో కమ్ బ్యాక్ అయ్యాడు. ఆ చిత్రంలో మంచు మనోజ్ రోల్ కి ఆయన పెరఫార్మెన్స్ కు విపరీతమైన ప్రసంశలు దక్కాయి.
ఆతర్వాత తేజ సజ్జ మిరాయ్ చిత్రంలో విలన్ గా కనిపించాడు. ప్రస్తుతం మిరాయ్ మూవీకి సోషల్ మీడియా టాక్, మౌత్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రావడమే కాదు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా థియేటర్స్ లో దూసుకుపోతుంది. పెద్ద బ్యానర్, కావలసినంత సపోర్ట్, తేజ సజ్జ, మంచు మనోజ్ ప్రమోషన్స్, సినిమా కూడా ఆడియన్స్ కు నచ్చెయ్యడంతో మిరాయ్ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
మంచు మనోజ్ రోల్ కి మంచి మార్కులు పడుతూ ఉండడంతో మంచు మనోజ్ ఇకపై ట్రాక్ లోకి వచ్చేసినట్టే అంటూ సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు. మంచు మనోజ్ మిరాయ్ సక్సెస్ ను తన తల్లి అలాగే ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాడు. అటు మంచు విష్ణు కూడా కన్నప్ప మూవీ తో పేరు తెచ్చుకున్నాడు.