Advertisementt

బాలయ్య-చిరు ఇద్దరికీ ఒకే ముహూర్తం

Sun 14th Sep 2025 10:55 AM
balakrishna  బాలయ్య-చిరు ఇద్దరికీ ఒకే ముహూర్తం
Chiru - Bobby Film Launch On Dasara​​ బాలయ్య-చిరు ఇద్దరికీ ఒకే ముహూర్తం
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరు నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది. మరోపక్క వసిష్ఠ విశ్వంభర ను వచ్చే ఏడాది సమ్మర్ కి షిఫ్ట్ చేసారు. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే మెగాస్టార్ మరో మూవీ ని స్టార్ట్ చెయ్యబోతున్నారు. అదే దర్శకుడు బాబీ తో చిరు వాల్తేర్ వీరయ్య తర్వాత మరోమారు జట్టు కడుతున్నారు. ఆ సినిమాని దసరా పండుగ రోజు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. 

మరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ తాండవం షూటింగ్ ఫినిష్ చేసారు. ఆ సినిమా డిసెంబర్ 5 న విడుదలకు రెడీ అవుతుంది అనే టాక్ నడుస్తుంది. అఖండ తాండవం తర్వాత ఆయన వీర సింహ రెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని తో మరో మూవీ కి కమిట్ అయ్యారు. ఈ చిత్రం కూడా దసరా కి స్టార్ట్ అవ్వబోతుంది అంటున్నారు. 

దసరా కు బాలయ్య కొత్త సినిమా మొదలై రెగ్యులర్ షూట్ కి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య కు దసరా సెంటిమెంట్. ఆ రోజే బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబో NBK 111 పట్టాలెక్కుతుంది అంటున్నారు. సో దసరా కు అటు మెగాస్టార్ చిరు, ఇటు నటసింహ బాలయ్య సినిమాలకు ముహూర్తం పెట్టారన్నమాట. 

Chiru - Bobby Film Launch On Dasara​​ :

Nandamuri Balakrishna 111th Film to Launch Dasara

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ