సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎంతగా చేరువవుతున్నారో.. ట్రోల్స్ కి అంతగా టార్గెట్ అవుతున్నారు సెలబ్రిటీస్. సినిమా హిట్ అయితే ఓకే. లేదంటే ఆ నటులపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. హీరోలైన, హీరోయిన్స్ ఎవ్వరైనా సోషల్ మీడియా వేదికగా చాలా సందర్భాల్లో ట్రోలింగ్ కి గురైనవారు. మంచు హీరో విష్ణు ఈ ట్రోలర్స్ పై పెద్ద యుద్ధమే చేసాడు.
ఈమధ్యన అనుష్క ఘాటీ ప్లాప్ తర్వాత ఆమె సోషల్ మీడియా కి దూరంగా ఉంటున్నట్లుగా ప్రకటించింది. ఇప్పుడు మరో నటి కూడా సోషల్ మీడియా కి బ్రేకిస్తున్నట్టుగా ప్రకటించింది. ఆమె ఎవరో కాదు తమిళ నటి ఐశ్వర్య లక్ష్మి. ప్రస్తుతం సినిమా అనే ఆటలో నేను ఉండాలంటే దానికి సోషల్ మీడియా చాలా అవసరం. దీనితో నేను ఏకీభవిస్తున్నాను. అందుకే నేను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవ్వొచ్చని, నాకు సోషల్ మీడియా ద్వారా ఉపయోగం ఉంటుంది అని భావించాను. అందుకే నేను యాక్టీవ్ అయ్యాను.
కానీ సోషల్ మీడియా వలన నా వర్క్ డిస్ట్రబ్ అయ్యింది. నా చిన్న చిన్న ఆనందాన్ని కూడా దుఃఖంగా మార్చేసింది.
నేను సోషల్ మీడియా వలన కలిసిన ఇబ్బందులు ఎదుర్కొనేందుకు చాలా కష్టపడ్డాను. సోషల్ మీడియాకి అనుకూలంగా నేను బ్రతకలేను. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ ముఖ్యంగా సోషల్ మీడియా లో లేని వారిని ప్రజలు నెమ్మదిగా మరచిపోతారని నాకు తెలుసు.. కానీ, నేను ఆ సాహసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక నటిగా, మహిళగా, నేను సరైన నిర్ణయం తీసుకున్నాను అని అనుకుంటున్నాను.. అంటూ ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియా కి గుడ్ బై చెప్పేసింది.