పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ద రాజా సాబ్ పదే పదే వాయిదా పడుతుంది అని ప్రభాస్ ఫ్యాన్స్ బెంగ పెట్టుకోకండి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మీకు బ్లాక్ బస్టర్ లోడింగ్, ఇకపై ఎవ్వరూ టెన్షన్ పడకండి అంటూ సోషల్ మీడియాలో నిర్మాత టిజి విశ్వప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి.. ఆ బ్యానర్ నుంచి బెస్ట్ VFX తో వచ్చిన మిరాయ్ గురించి ప్రేక్షకులు మాట్లాడుతున్న మాటలవి.
మిరాయ్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో బాక్సాఫీసు కరువు తీర్చేసింది. అందుకే అనేది మారుతి రాజా సాబ్ ని లేట్ చేస్తే చేసాడు కానీ.. రాజా సాబ్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఓపిక పడితే అంత బెస్ట్ అవుట్ ఫుట్ బయటికి వస్తుంది. ఈ సినిమాకి మారుతి డైరెక్టర్ అన్నప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగా ఆందోళన పడ్డారో అందరూ చూసారు.
సో ఇకపై రాజా సాబ్ విషయంలో అసలు టెన్షన్ పడకండి. మధ్య మధ్యలో ప్రభాస్ లుక్స్, రాజా సాబ్ టీజర్ చూసాక కాస్త కూల్ అయ్యారు. ఇప్పుడు మిరాయ్ అవుట్ ఫుట్ తో నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ రాజా సాబ్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నారో అని ఊహించుకుని వారు నిజంగా ఊపిరి పీల్చుకుంటున్నారు.