Advertisementt

తమ్ముడు సినిమాపై మంచు విష్ణు ట్వీట్

Fri 12th Sep 2025 03:59 PM
vishnu manchu  తమ్ముడు సినిమాపై మంచు విష్ణు ట్వీట్
Manchu Vishnu : Wishing all the best for Mirai. God speed to the entire team తమ్ముడు సినిమాపై మంచు విష్ణు ట్వీట్
Advertisement
Ads by CJ

మంచు అన్నదమ్ములైన మంచు విష్ణు-మంచు మనోజ్ ల నడుమ ఆస్తి తగాదాలు నాలుగు గోడలమధ్యన పరిష్కరించుకోకుండా రోడ్డు కెక్కి రచ్చ రచ్చ చేసుకున్నారు. మంచు విష్ణు సైలెంట్ గా చెయ్యాల్సింది చేస్తే.. మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చేసి హడావిడి చేసాడు. మనోజ్ కారణంగా మోహన్ బాబు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. 

అయితే మంచు మనోజ్ మాత్రం కన్నప్ప సినిమా విడుదల సమయంలో గొడవలన్నీ పక్కనపెట్టి అన్న మంచు విష్ణు సినిమా బాగా ఆడాలని ట్వీట్ చేసాడు, కన్నప్ప విడుదలయ్యాక అన్న విష్ణు నటనను పొగుడుతూ మీడియా ముందు మాట్లాడాడు. దానితో మంచు మనోజ్ నటించిన మిరాయ్ చిత్ర రిలీజ్ సమయంలో మంచు విష్ణు తమ్ముడు సినిమాపై ట్వీట్ చేస్తాడా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. 

మంచు విష్ణు మిరాయ్ రిలీజ్ సందర్భంగా Wishing all the best for #Mirai. God speed to the entire team.. అంటూ మంచు మనోజ్ పేరును స్పెషల్ గా ప్రస్తావించకపోయినా.. మిరాయ్ టీమ్ లో ఆయన కూడా ఉన్నాడు కాబట్టి మంచు విష్ణు తమ్ముడు సినిమా కి ఆల్ ద బెస్ట్ చెప్పినట్టే కదా..

అన్న ట్వీట్ కి తమ్ముడు మనోజ్ రిప్లై ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది.. Thank you soo much anna, From team #Mirai alias #BlackSword అంటూ మంచు మనోజ్ అన్నకు థాంక్స్ చెప్పాడు. మరి మెల్లగా మంచు అన్నదమ్ముల నడుమ సఖ్యత ఏర్పడుతుందేమో చూడాలి. 

Manchu Vishnu : Wishing all the best for Mirai. God speed to the entire team:

Vishnu Manchu best wishes to Mirai team

Tags:   VISHNU MANCHU
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ