Advertisementt

మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి ప్ర‌క‌ట‌న‌

Fri 12th Sep 2025 02:53 PM
tamannaah  మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి ప్ర‌క‌ట‌న‌
Tamannaah Bhatia wedding plans మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి ప్ర‌క‌ట‌న‌
Advertisement
Ads by CJ

న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో బ్రేక‌ప్ త‌ర్వాత త‌మ‌న్నా భాటియా ఒంట‌రి అయిన సంగ‌తి తెలిసిందే. బ్రేక‌ప్‌తో నిరాశ ఎదురైంది. అయితే ఇప్పుడు త‌మ‌న్నా పెళ్లి చేసుకునే ఆలోచ‌న చేయ‌డం లేదా?  జీవిత భాగ‌స్వామిగా తాను ఎలా ఉండాల‌ని అనుకుంటోంది? ఈ ప్ర‌శ్న‌ల‌కు త‌మ‌న్నా జ‌వాబిచ్చింది.

ప్ర‌స్తుతం జీవిత భాగ‌స్వామి గురించి ఆలోచిస్తున్నాన‌ని త‌మ‌న్నా ఓ రియాలిటీ షోలో వెల్ల‌డించింది. అంత‌కుముందే తాను మంచి భాగ‌స్వామిగా ఉండాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలిపింది. న‌న్ను పెళ్లి చేసుకునేవాడి ప్యాకేజీ గురించి చెబుతాను! అని త‌మ‌న్నా వ్యాఖ్యానించింది. మొత్తానికి త‌మ‌న్నా పెళ్లి ఆలోచ‌న‌ల్లో ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే వ‌రుడు ఎలా ఉండాలో డిమాండ్ లు పెట్ట‌కుండా, తాను మంచి భాగ‌స్వామిగా ఉంటాన‌ని మాత్రం ప్రామిస్ చేసింది.

ప్ర‌స్తుతం నాలుగు సినిమాల‌తో మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ ప‌రంగా బిజీగా ఉంది. అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న రేంజ‌ర్ అనే చిత్రంలో న‌టిస్తున్న త‌మ‌న్నా రోమియో, వివాన్ అనే చిత్రాల‌తోను బిజీగా ఉంది. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ యాక్ష‌న్ డ్రామాలోను త‌మ‌న్నా న‌టిస్తోంది.

 

Tamannaah Bhatia wedding plans:

Tamannaah Bhatia marriage plans

Tags:   TAMANNAAH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ