Advertisementt

అనుష్క బిగ్ డెసిషన్

Fri 12th Sep 2025 04:15 PM
anushka   అనుష్క బిగ్ డెసిషన్
Sweety Takes A Short Break అనుష్క బిగ్ డెసిషన్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం స్వీటీ అనుష్క ఘాటీ తో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. అనుష్క ఘాటీ గత శుక్రవారం విడుదలైంది. విడుదలైన మొదటి షో కె నెగెటివ్ టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్ కె ఘాటీ పనైపోయింది. మొదటి వారం ముగిసేసరికి థియేటర్స్ నుంచి మాయమైపోయింది. 

అయితే ఘాట్ రిజల్ట్ విషయం పక్కనపెడితే.. అందరూ అనుష్క నే విమర్శిస్తున్నారు. అనుష్క మీడియా ముందు రాకుండా తప్పించుకోవడం పై ట్రోల్ నడిచింది. ఘాటీ ప్లాప్ లో అనుష్క దే మేజర్ పార్ట్ అన్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు. స్వీటీ అనుష్క ఇకపై సినిమాలు చేయకపోవడమే బెటర్ అంటూ చేస్తున్న కామెంట్స్ తో అనుష్క హార్ట్ అయినట్లుగా ఉంది. 

అందుకే ఆమె సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. అది కూడా ఓ లెటర్ తో చెప్పుకొచ్చింది. నీలి వెలుగును దీపకాంతిగా మార్చుకుంటూ... సరైన జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రపంచంతో మళ్లీ కలిసిపోవడానికి కొంతకాలం సోషల్ మీడియా నుండి దూరంగా ఉండబోతున్నాను. 

త్వరలోనే మరిన్ని మంచి కథలతో, అంతకుమించిన ప్రేమతో మీ ముందుకొస్తాను. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి .. ప్రేమతో మీ స్వీటీ  అంటూ అనుష్క తనేం చెప్పదలుచుకుందో ఎమోషనల్ గా లెటర్ ద్వారా చెప్పుకొచ్చింది.

Sweety Takes A Short Break:

Anushka Shetty Takes a Break from Social Media

Tags:   ANUSHKA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ