అనుపమ పరమేశ్వరన్ అంటే ఒక్కప్పుడు ట్రెండీ లుక్స్ తో చాలా డీసెంట్ కేరెక్టర్స్ లో పద్దతిగా కనిపించేది. కానీ కొద్దిరోజులుగా ఆమె బోల్డ్ అవతారమెత్తింది. గ్లామర్ షో విషయంలో తగ్గడం లేదు. కాకపోతే టిల్లు స్క్వేర్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ లిల్లీ పాత్రలో ఆమె అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోయారు.
అభిమానుల బాధను అర్ధం చేసుకున్న అనుపమ.. కొన్నిసార్లు కొన్ని నచ్చకపోయినా చెయ్యాల్సి ఉంటుంది.. అంటూ కవర్ చేసింది. అయితే లిల్లీ కేరెక్టర్ విషయంలో అభిమానులు చేసిన రాద్ధాంతం చూసిన అనుపమ పరదా చిత్రం రిజల్ట్ తేడా కొట్టాక బాగా డిజప్పాయింట్ అయ్యింది. పరదా చిత్ర ప్రమోషన్స్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రేక్షకులు రారు అంటూ బాధపడింది.
ఇప్పుడు ఆమె నటించిన కిష్కిందపురి మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. ఈ తరుణంలో అనుపమ తన బాధను మరోసారి బయటపెట్టింది. కిష్కిందపురి ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. టిల్లు స్క్వేర్ చూసాక నా పాత్రను డైజెస్ట్ చేసుకోలేకపోయాం అన్నారు. పరదా లాంటి మంచి సినిమా చేస్తే చూడరు అంటూ ఎమోషనల్ అయ్యింది. అది చూసి అయ్యో అనుపమ బాధ వర్ణనాతీతం అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.