ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీ తో ఉన్నారు. 15 ఏళ్ళ పాటు NDA తో పొత్తు అనడమే కాదు ఆ విషయంలో ఆయన పక్కా క్లారిటీ తో ఉన్నారు. ఎప్పటికప్పుడు జనసైనికులకు కూడా అదే చెబుతున్నారు. ఎవరూ సోలోగా ఉత్సాహపడొద్దు మనం కూటమి లో కలిసి కట్టుగా ఉన్నామని పదే పదే చెబుతున్నారు.
ఈరోజు బుధవారం అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ సక్సెస్ సభలోను పవన్ మరోసారి తన కార్యకర్తలకు అదే చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తో పవన్ కళ్యాణ్ ఎంత స్నేహంగా ఉన్నారో.. అక్కడ సభకి కలిసొచ్చిన వీడియోస్, కలిసి కూర్చుని ఇద్దరూ ఆత్మీయంగా ముచ్చటిస్తున్న ఫొటోస్ చూస్తే తెలుస్తుంది.
ఇక ఆ సభలో పవన్ కళ్యాణ్ లేవగానే జనసేన అభిమానులు, కార్యకర్తలు జనసేన జెండాలు పైకెత్తి జై పవన్ అంటూ నినాదాలు చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ మన జెండాలు కిందకు దించండి మనం కలిసి పనిచేస్తున్నాం అంటూ తన కార్యకర్తలకు చాలా స్మూత్ గా చెప్పారు. మరి ప్రస్తుతం ఏపీ ని అభివృద్ధి పదంలో తీసుకేళ్లడానికి కూటమితో పొత్తులో వెళ్లడమే కాదు అది మరో 15 ఏళ్ళు ఉంటుంది అని పై పై మాటలకు చెప్పడమే కాదు పవన్ కళ్యాణ్ చేతల్లో నిరూపిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి.