కన్నడలో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చిత్రం కన్నడలోనే కాదు విడుదలైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దానికి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 ని భారీగా తెరకెక్కించారు. ఈ చిత్రం అక్టోబర్ 2 న దసరా స్పెషల్ గా విడుదల కాబోతుంది. కాంతార 1 పై ప్రతి భాషలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది.
అయితే కాంతార చాప్టర్ 1 మలయాళ థియేట్రికల్ రైట్స్‌ను స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ దక్కించుకొన్నది. ఈ సినిమాను కేరళ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు పృథ్వీరాజ్ కాంతార 1 హక్కులను చేజిక్కించుకొన్నారు. ఇదే సమయంలో కేరళలోని థియేటర్ అసోసియేషన్ ఎఫ్ఈయూఓకే కొన్ని ఆంక్షలు పెట్టడం చర్చనీయాంశం అయ్యింది.
దాదాపు 55 శాతం కమిషన్ మాకు ఇవ్వాలని డిమాండ్ చెయ్యడమే కాదు అలా కుదరని పక్షంలో కాంతార 1 ను మలయాళంలో నిషేధిస్తామని అల్టిమేటం జారీ చేసింది. దానితో థియేటర్ అసోసియేషన్‌తో చర్చలు జరిపి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు సినీ వర్గాలు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది.