మలయాళంలో దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ కొత్త లోక ఇప్పుడు రెండు వారాలు తిరగకముందే 200 కోట్ల క్లబ్బులోకి చేరి అందరికి చిన్నపాటి షాక్ మరింత సర్ ప్రైజ్ ఇచ్చింది. చిన్న చిత్రంగా తెరకెక్కిన కొత్త లోక చాప్టర్ 1 విడుదలైన ప్రతి భాషలోనూ సక్సెస్ అయ్యింది.
కళ్యాణి ప్రియదర్శిని మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈచిత్రాన్ని తెలుగులో నిర్మాత నాగవంశీ సితార బ్యానర్ పై రిలీజ్ చేసారు. తెలుగులో కలెక్షన్స్ విషయం క్లారిటీ లేకపోయినా.. ఇప్పుడు ఈ చిన్న చిత్రం అఫీషియల్ గా 200 కోట్ల క్లబ్బులోకి చేరడం మాత్రం నిజంగా ఆశ్చర్యమే. ఈ చిత్రాన్ని తమదగ్గరకొచ్చినా చెయ్యకుండా వదులుకున్నందుకు మలయాళ హీరోలు కొంతమంది ఇప్పుడు బాధపడిపోతున్నారు.
ఇక కొత్త లోక చాప్టర్ 1 మాత్రమే కాదు ఈ చిత్రం ఐదు భాగాలుగా తెరకెక్కనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. చాప్టర్ 2, చాప్టర్ 3 ఇలా ప్రతి భాగంలోనూ క్రేజీ స్టార్స్ భాగమవుతారని చెబుతున్నారు. మరి మొట్టమొదటి సూపర్ వుమన్ కొత్త లోక 200 కోట్లతో కొత్త ఒరవడి సృష్టించింది అనే చెప్పాలి.