ఏపీ యువ మంత్రి నారా లోకేష్ తనని సహాయం కోరివచ్చినవారికి తక్షణమే స్పందించడమే కాదు ఆ సమస్యకు పరిష్కారం చూపేవరకు నిద్ర పోకుండా తన టీమ్ తో ఆ పని పూర్తి చేయిస్తున్నారు. దుబాయ్ లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించడం కానివ్వండి, సోషల్ మీడియా వేదికగా లోకేష్ అన్నా అంటూ సహాయం అర్దించిన ప్రతి ఒక్కరికి నారా లోకేష్ నేనున్నాను అంటూ అండగా నిలబడుతున్నారు. టీడీపీ అభిమానులకు, కార్యకర్తలకు లోకేష్ ఇచ్చే సపోర్ట్, వారికి అండగా నిలుస్తూ పెద్ద అన్న మాదిరి చేసే సహాయం వెలకట్టలేనిది.. అని వారే మాట్లాడుతున్నారు.
ఇప్పుడు కూడా మంత్రి నారా లోకేష్ ఈరోజు బుధవారం అనంతపురంలో జరగాల్సిన సూపర్ సిక్స్... సూపర్ హిట్ సభకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన అనంతపురం పర్యటన రద్దు చేసుకున్నారు. కారణం నేపాల్ లో నెలకొన్నపరిస్థితుల నేపథ్యంలో ఏపీకి చెందిన వారిని ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై మంత్రి లోకేష్ దృష్టి సారించారు. ఉదయం 10 గంటలకు సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు లోకేష్ వెళ్లనున్నారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ సెంటర్ కి రావాలని ఆదేశాలు జారీ చేసారు లోకేష్. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించనున్నారు. నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసురావడానికి మంత్రి లోకేష్ ఏంతో ముఖ్యమైన అనంతపురం పర్యటనను పక్కనపెట్టి మరీ రంగంలోకి దిగారు.