ఇప్పటివరకు కవిత చేష్టలకు కౌంటర్ ఇద్దామంటే కేసీఆర్,కేటీఆర్ ఏమనుకుంటారో అని చాలామంది కేసీఆర్ శిష్యులు, బీఆర్ ఎస్ నేతలు నోళ్లు కట్టేసుకున్నారు. కవిత ను ఏమి అనలేక నలిగిపోయారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కవిత ను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. అంతేకాని కూతురుని ఒక్క మాట అనలేదు. దానితో బీఆర్ ఎస్ నేతలు కూడా కామ్ గానే కనిపించారు.
ఇక కేటీఆర్ కూడా కవిత విషయం లైట్ తీసుకున్నారు. కవిత అంశం ముగిసిన ముచ్చట అన్నారు. అన్నీ, అందరితో చర్చించాకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు అని కేటీఆర్ ప్రకటించేసారు. సో ఇకపై కవిత విషయంలో ఇక బీఆర్ ఎస్ నేతలు నోరు కట్టేసుకోవక్కర్లేదు. కవిత కు కౌంటర్ ఇవ్వకుండా మడి కట్టుకుని కూర్చోవక్కర్లేదు.
ఇకపై కవిత విషయంలో మీడియా ముందు ఏమైనా మాట్లాడొచ్చు, ఆమెను తిట్టొచ్చు, ఆమె మాట్లాడే మాటలకూ కౌంటర్ వెయ్యొచ్చు. పెద్ద సారుకి, కేటీఆర్ సారు కి అసలు భయపడక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళే కాదనుకున్నారు. సో ఇకపై కవిత పై రెచ్చిపోవచ్చు.