Advertisementt


ఖాన్ వార‌సుడి సిరీస్‌లో రాజమౌళి

Tue 09th Sep 2025 09:52 AM
rajamouli  ఖాన్ వార‌సుడి సిరీస్‌లో రాజమౌళి
Ba**ds Of Bollywood Trailer Out ఖాన్ వార‌సుడి సిరీస్‌లో రాజమౌళి
Advertisement
Ads by CJ

కింగ్ ఖాన్ షారూఖ్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ ద‌ర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వార‌సుడి ఘ‌న‌మైన లాంచింగ్ కోసం షారూఖ్ భారీ పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఖాన్ కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ అసాధార‌ణ బ‌డ్జెట్‌తో సాహ‌సం చేస్తోంది.

ఎట్ట‌కేల‌కు అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూసిన ఆర్య‌న్ డెబ్యూ మూవీ `ది బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్` ట్రైలర్ విడుద‌లైంది. ట్రైల‌ర్ ఆద్యంతం విందు వినోదాల‌కు కొదవేమీ లేదు. విజువ‌ల్ గ్రాండియారిటీతో ఇది ట్రీట్ ఇచ్చింది. ముగ్గురు ఖాన్లు మొదటిసారి కలిసి నటించిన చారిత్రాత్మక అతిధి పాత్రల‌ను ఈ టీజ‌ర్ లో చూపించారు. సిరీస్‌లో రణవీర్ సింగ్, సారా అలీ ఖాన్, బాద్షా, దిశా పటానీ త‌దిత‌రులు కనిపిస్తారు.

ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్ లో ప్రీమియర్ కానుంది. అయితే తాజాగా రిలీజైన‌ ట్రైల‌ర్ లో ఒక బిగ్ స‌ర్ ప్రైజ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది .. ముఖ్యంగా టాలీవుడ్ దిగ్గ‌జ‌ ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ట్రైల‌ర్‌లో అక‌స్మాత్తుగా ప్ర‌త్య‌క్షం కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అమీర్ ఖాన్ తో రాజ‌మౌళి ఏదో ఉత్కంఠ‌గా మాట్లాడుతూ క‌నిపించారు. కొన్ని సెక‌న్ల పాటు ఆ ఇద్ద‌రి ప‌రిహాసం ఆక‌ట్టుకుంది. ఖాన్ ల త్ర‌యం ఎంట్రీ స‌హా ఈ సినిమాలో క‌థానాయ‌కుడిగా న‌టించిన ల‌క్ష్య, రాఘ‌వ్, బాబి డియోల్ త‌దిత‌రులు ఆహార్యం మైమ‌రిపిస్తోంది.

ది బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్* సినిమా పరిశ్రమలో తెర వెనుక భోగోతంపై సెటైరిక‌ల్ డ్రామాగా రూపొందుతోంది. ఆర్య‌న్ తెలివితేట‌ల‌కు పాపా షారూఖ్ తెగ‌ మురిసిపోతున్నారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతుంది.  

ఆల్బమ్ ఓకే..

టి-సిరీస్‌తో కలిసి ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ సంగీతం ఇప్ప‌టికే వెబ్ లోకి వ‌చ్చింది. ఈ ఆల్బమ్‌ను శశ్వత్ సచ్‌దేవ్ స్వరపరచగా, గెస్ట్ స్వరకర్తలు అనిరుధ్ రవిచందర్ , ఉజ్వల్ గుప్తా స్వరపరిచారు. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచి, అరిజిత్ సింగ్- అమీరా గిల్ పాడిన మొదటి ట్రాక్, `బద్లీ సి హవా హై` ఇటీవ‌ల విడుద‌లై అభిమానులను ఆకట్టుకుంది. అరిజిత్ సింగ్ పాడ‌గా, శశ్వత్ సచ్‌దేవ్ స్వరపరిచిన `తు పెహ్లి తు ఆఖ్రి` పాట కూడా ఆక‌ట్టుకుంది.

Ba**ds Of Bollywood Trailer Out:

The Ba***ds Of Bollywood will release on Netflix on September 19

Tags:   RAJAMOULI
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ