జాన్వీ కపూర్ ఏ డ్రెస్ వేసినా అందాలు ఆరబొయ్యడంలో ఆమెకు ఆమె సాటి అనేలా ఉంటుంది. చీర కట్టినా, పొట్టి డ్రెస్ వేసినా ఏదైనా సరే ఆమె గ్లామర్ చూపించేందుకు తహతహలాడుతుంది. సినిమాల్లో జాన్వీ కపూర్ కి బ్లాక్ బస్టర్ హిట్ రాకపోయినా.. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడానికి ప్రధాన కారణం ఆమె గ్లామర్ అనే చెప్పాలి.
ఒక్క తిరుమల శ్రీవారి దర్శనానికి వెళితే తప్ప మిగతా ఎప్పుడైనా జాన్వీ కపూర్ తన కాస్ట్యూమ్స్ ని అందాలు ఆరబోసే విధంగా డిజైన్ చేయించుకుంటుంది. తాజాగా జాన్వీ కపూర్ వెడ్డింగ్ డ్రెస్ లో అద్భుతంగా రెడీ అయ్యింది. మెడనిండా ఆభరణాలు, పాపిడి బిళ్ళతో అచ్చంగా పెళ్లి కూతురులా రెడ్ డిజైనర్ వెడ్డింగ్ కాస్ట్యూమ్ లో జాన్వీ కపూర్ అద్దరగొట్టేసింది.
ఆ వెడ్డింగ్ డ్రెస్ లోను ఆమె అందాలు చూపించడానికి ట్రై చేసిన విధానానికి యూత్ షాకవుతున్నారు. డ్రెస్ ఏదైనా అందాల ఆరబోతే జాన్వీ కపూర్ ప్రధాన లక్ష్యం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక జాన్వీ కపూర్ వెడ్డింగ్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.