కన్నడలో సూపర్ హిట్ అయిన సు ఫ్రమ్ సో ని మైత్రి మూవీ మేకర్స్ వారు డబ్ చేసి తెలుగులో విడుదల చేసారు. కన్నడలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో అంతగా ఆడలేదు. ఇక సు ఫ్రమ్ సో థియేటర్స్ నుంచి వెళ్ళిపోయాక ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఓటీటీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్న సమయంలో మేకర్స్ సు ఫ్రమ్ సో ఓట్స్ డేట్ అనౌన్స్ చేసారు.
సెప్టెంబర్ 5 నుంచి సు ఫ్రమ్ సో ఓటీటీ లో స్ట్రీమింగ్ అంటూ డేట్ అనౌన్స్ చేసారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్న జియో హాట్ స్టార్ సు ఫ్రమ్ సో సెప్టెంబర్ 5 నుంచి పోస్ట్ పోన్ చెయ్యడంతో ఓటీటీ ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు.
ఇక సెప్టెంబర్ 9 న సు ఫ్రమ్ సో స్ట్రీమింగ్ అని ప్రకటించారు. అంటే నేటి నుంచి సు ఫ్రమ్ సో జియో ప్లస్ హాట్ స్టార్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు సు ఫ్రమ్ సో ని ఇప్పుడు ఓటీటీలో వీక్షించేయ్యండి.