Advertisementt

కొడుకును రాజకీయాల్లోకి దించుతున్న షర్మిల

Mon 08th Sep 2025 12:19 PM
sharmila  కొడుకును రాజకీయాల్లోకి దించుతున్న షర్మిల
YS Sharmila Son Raja Reddy Political Entry కొడుకును రాజకీయాల్లోకి దించుతున్న షర్మిల
Advertisement
Ads by CJ

అన్న జగన్ తో ఆస్తి వ్యవహారాల్లో గొడవపడి తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టి ఇక్కడ ఓ పార్టీ పెట్టి దానిని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆతర్వాత ఏపీలో అడుగుపెట్టి అక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న వైఎస్సార్ కుమార్తె షర్మిల తన అన్న జగన్ పై ఎప్పటికప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటుంది. వైఎస్సార్ వారసులు జగన్, షర్మిల ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారయ్యారు. 

ఇక షర్మిల తన కొడుకు రాజారెడ్డికి ప్రేమించిన యువతితో అంగరంగ వైభవంగా వివాహం జరిపించింది. ఆ పెళ్ళిలో జగన్ కనిపించాడు.. నామ్ కే వాస్త్ అన్నట్టుగా జగన్ ఆ పెళ్లి లో కనిపించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు షర్మిల తన కొడుకుని రాజకీయరంగేట్రానికి రెడీ చేస్తుంది అనే మాట వినబడుతుంది. అందులో భాగంగా ఇవ్వాళ కర్నూల్ ఉల్లి మార్కెట్ కు తల్లితో సహా సందర్శనకు వెళ్ళిన షర్మిల కొడుకు రాజారెడ్డి. 

ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని మరీ వైఎస్ రాజారెడ్డి బయలుదేరడం చూసిన వారు త్వరలోనే షర్మిల కొడుకు రాజారెడ్డి రాజకీయ అరంగ్రేటం చేయనున్నట్లు ఏపీలో చర్చ మొదలైంది. 

YS Sharmila Son Raja Reddy Political Entry:

YS Sharmila Son Raja Reddy Political Entry Soon

Tags:   SHARMILA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ