పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం OG ఈ నెల 25 న విడుదలకు సిద్దమవుతుంది. అంటే మరో పదిహేను రోజుల్లో OG ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. OG పాన్ ఇండియా మూవీ అంటూ దర్శకుడు సుజిత్, నిర్మాత దానయ్య అనౌన్స్ చేసారు. మరి విడుదలకు ఎంతో సమయం లేదు OG కి.
ఇప్పటివరకు OG ప్రమోషన్స్ మొదలు కాలేదు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. మరోపక్క OG రిలీజ్ డేట్ వచ్చేస్తుంది, ఇంకా ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడం పై పవన్ ఫ్యాన్స్ ఆందోళనపడుతున్నారు. పాన్ ఇండియా మూవీ అని ప్రకటించడం ప్రమోషన్స్ పట్టించుకోకపోవడం పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుజిత్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. OG పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్ అంటూ మేకర్స్ అఫీషియల్ అప్ డేట్ ఇచ్చారు. అంటే పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా ఫినిష్ అవలేదా, ప్రమోషన్స్ ఇంకెప్పుడు మొదలెడతావయ్యా OG అంటూ అభిమానులు మొత్తుకుంటున్నారు. మీడియా కూడా అదే అడుగుతుంది. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రమోషన్స్ లేకుండా దించొద్దు అంటున్నారు. మరి విజయవాడలో మొదలు కాబోయే ఈవెంట్ తో OG ప్రమోషన్స్ ప్రోపర్ గా మొదలవుతాయేమో చూడాలి.