సూపర్ స్టార్ రజినీకాంత్ - కమల్ హాసన్ ఎంత మంచి స్నేహితులో అందరికి తెలుసు. వారిద్దరూ కలిసి సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలని ఇరువురు అభిమానులు కోరుకుంటారు. ఈమధ్యన కూలి ప్రమోషన్స్ లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ రజిని-కమల్ కలయికలో బిగ్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పాడు.
హా ఇదంతా ఒట్టి గాలి వార్తే.. కూలి ని ప్రమోట్ చేసే స్ట్రాటజీ అన్నారు చాలామంది. కూలి విడుదలయ్యాక కూడా రజినీకాంత్-కమల్ కాంబో మూవీపై చాలా టాక్ నడిచింది. అయితే ఇప్పుడు కమల్ హాసన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించే విషయమై సైమా అవార్డ్స్ వేదికపై రియాక్ట్ అవడం హాట్ టాపిక్ అయ్యింది.
మీరు-సూపర్ స్టార్ రజిని కలయికలో సినిమాను ఆశించవచ్చా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు కమల్ చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఆడియన్స్ మా కాంబినేషన్ లో మూవీని ఇష్టపడితే మంచిదే కదా.. ప్రేక్షకులు సంతోషంగా ఉంటే మాకూ ఆనందమే. మేమిద్దరం కలిసి నటించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం.
అది ఇప్పటివరకు కుదర్లేదు. త్వరలోనే మీ ముందుకు మేమిద్దరం కలిసి రానున్నాం. అది మిమ్మల్ని చాలా సర్ప్రైజ్ చేస్తుంది అంటూ కమల్ రజిని తో మల్టీస్టారర్ పై చేసిన కామెంట్స్ వారి వారి అభిమానులనే కాదు కామన్ ఆడియన్స్ ను సైతం సంతోషపెట్టింది.