మళయాళంలోనే కాదు టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా స్టార్ హీరోల నడుమ స్నేహలు చూస్తూనే ఉంటాము. ఎంత పెద్ద స్టార్స్ అయినా ఫ్రెండ్ షిప్ కోసం నిలబడతారు. మలయాళంలో అలాంటి స్నేహం మోహన్ లాల్, మమ్ముట్టి నడుమ కనిపిస్తుంది. వారిద్దరూ ఒకేసారి ఇండస్ట్రీకి ఎంటర్ అయినా.. ఎవరి సినిమాలు వారు చేసుకుంటున్నా.. చాలా స్నేహంగా ఉంటారు.
ఈమధ్యన మమ్ముట్టి అనారోగ్యం బారిన పడిన సందర్భంలో మోహన్ లాల్ మమ్ముట్టి కోలుకోవాలని స్పెషల్ పూజలు చేసారు. శబరి మలైలో అయితే ఓ స్పెషల్ పూజ వివాదానికి కూడా దారి తీసింది. రీసెంట్ గా మమ్ముట్టి కోలుకుని షూటింగ్స్ కి హాజరవుతున్న విషయాన్ని మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇప్పుడు మరోసారి మోహన్ లాల్-మమ్ముట్టి స్నేహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిన్న ఆదివారం మమ్ముట్టి బర్త్ డే. మమ్ముట్టికి సోషల్ మీడియా వేదికగా ప్రముఖుల శుభాకాంక్షలు, ఫ్యామిలీ సెలెబ్రేషన్స్ అన్ని కామ్ గా జరిగిపోయాయి. కానీ మోహన్ లాల్ మాత్రం తను హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో కి మమ్ముట్టి నటించిన సినిమా కేరెక్టర్స్ కి సంబందించిన ఫొటోస్ ముంద్రించిన షర్ట్ వేసుకుని స్నేహితుడి బర్త్ డే కి విషెస్ తెలుపుతూ.. ఆ షోకి రావడం హైలెట్ అయ్యింది.
మోహన్ లాల్ ఇలా మమ్ముట్టి బర్త్ డే కి స్పెషల్ గా మమ్ముట్టి ఫొటోస్ ఉన్న షర్ట్ డిజైన్ చేయించుకుని మరీ ఓ షో కోసం వేసుకోవడం పై మోహన్ లాల్ అభిమానులే కాదు మమ్ముట్టి అభిమానులు సైతం ముగ్దులవుతున్నారు.