బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కెరీర్ లో `దబాంగ్` బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. కెరీర్ పరంగా తిరోగమనంలో ఉన్న సల్మాన్ కి సరైన సమయంలో ఈ విజయాన్ని అందించాడు దర్శకుడు అభినవ్ కశ్యప్. కానీ సల్మాన్, అతడి కుటుంబ సభ్యులతో అభినవ్ కి తీవ్ర విభేధాలు తలెత్తడంతో `దబాంగ్ 2`కి అతడు పని చేయలేదు. దబాంగ్ 2 కి సల్మాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ దర్శకత్వం వహించారు.
అయితే దబాంగ్ 2 కి దర్శకత్వం వహించాల్సిందిగా సల్మాన్, అతడి కుటుంబీకులు వెంటపడ్డారని, కానీ తాను నిరాకరించానని అభినవ్ కశ్యప్ తెలిపారు. తాను తిరస్కరించిన కారణంగా తనను లక్ష్యంగా చేసుకుని తీవ్ర దుష్ప్రచారం చేసారని, ప్రతీకారంతో వెంటాడారని అభినవ్ ఆవేదన వెల్లగక్కారు. ఇప్పుడు దబాంగ్ 15 వసంతాలకు చేరువలో ఉండగా అభినవ్ ది స్క్రీన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సల్మాన్ పై తీవ్రంగా ఆరోపించాడు.
సల్మాన్ ఖాన్ ఒక గూండా అని, అతడికి నటనపై ఎప్పుడూ ఆసక్తి లేదని అన్నాడు. అతడు పని చేయడం ద్వారా ఇతరులకు ఉపకరిస్తాడని, స్టార్ గా సెలబ్రిటీగా కొనసాగే ఆసక్తి అతడికి ఉందని ఆరోపించారు అభినవ్. సల్మాన్, అతడి కుటుంబం ప్రతీకారంతో కక్ష తీర్చుకుంటారని కూడా ఫైరయ్యాడు. సల్మాన్ 25 సంవత్సరాలుగా నటించడం లేదని, 50 ఏళ్లుగా అతడి కుటుంబం సినీరంగంలో ఉన్నందున దీనిని ఇలానే నడిపిస్తాడని కూడా అభినవ్ ఆరోపించారు. సల్మాన్ నటించిన `తేరే నామ్` చిత్రానికి తన సోదరుడు అనురాగ్ కశ్యప్ కి రచయితగా క్రెడిట్స్ ఇచ్చేందుకు నిరాకరించిన నిర్మాత బోనీకపూర్ పైనా అభినవ్ తీవ్ర ఆరోపణలు చేసారు. సల్మాన్ అతడి కుటుంబ సభ్యులు రాబందులు. వారు అన్నిటినీ నియంత్రిస్తారని కూడా అభినవ్ ఆరోపించాడు.