అసలే వార్ 2 డిజప్పాయింట్ మూడ్ లో నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బయటికి రాలేకపోతున్నారు.. వార్ 2 తీవ్రంగా నిరాశపరిచినా.. ఎన్టీఆర్ ను ఓ వర్గం పని గట్టుకుని టార్గెట్ చెయ్యడమే కాదు, మీడియా కూడా ఎన్టీఆర్ ను పదే పదే ఏసుకోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను చాలా బాధపెట్టింది. ఆ బాధ మొత్తం ప్రశాంత్ నీల్ ఇవ్వబోయే అప్ డేట్ తో పోగొట్టుకోవాలని వారు భావిస్తున్నారు.
కానీ ఇప్పుడు ఎన్టీఆర్-నీల్ కలయికలో తెరకెక్కబోయే డ్రాగన్(వర్కింగ్ టైటిల్) చిత్రంలో హీరోయిన్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ నటిస్తుంది. అఫీషియల్ గా రుక్మిణి పేరు అనౌన్స్ చెయ్యకపోయినా.. డ్రాగన్ లో రుక్మిణి ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తుంది. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం మదరాసి సెప్టెంబర్ 5 న విడుదలైంది.
శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన మదరాసి కి పాజిటివ్ రివ్యూస్ రాలేదు. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ ప్రేక్షకులను మదరాసి ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. అంతేకాదు ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెజెన్స్ బావున్నా ఆమె కేరెక్టర్ నిడివి తక్కువ కావడంతో అందరిని డిజప్పాయింట్ చేసింది.
రుక్మిణి వసంత్ మదరాసి తో హిట్ అందుకుంటుంది, ఆతర్వాత డ్రాగన్ మూవీకి క్రేజీ హీరోయిన్ గా రుక్మిణి ఉంటుంది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ మదరాసి రిజల్ట్ వారిని ఇబ్బంది పెట్టింది. ఇక ఆమె నటించిన కాంతారా 1 ఏం చేస్తుందో అని వారు దిగులు పడుతున్నారు.