పెద్ద సినిమాలొస్తున్నాయ్ బాక్సాఫీసు కు కళ వస్తుంది.. పాన్ ఇండియా సినిమాలొస్తున్నాయ్ ప్రేక్షకుల సందడి కనిపిస్తుంది, ఇక థియేటర్స్ కి మంచి రోజులొచ్చాయి, ఆడియన్స్ పెద్ద సినిమాలు చూసేందుకు థియేటర్స్ కి వస్తారని ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిసారి ఆ సినిమా లు నిరాశపరుస్తున్నాయి.
ఆగష్టు 14 న ఎన్నో ఆశలు పెట్టుకున్న కూలి, వార్ 2 ఫుల్ గా డిజప్పాయింట్ చేసాయి. ఆతర్వాత మళ్ళీ వినాయక చవితికి పెద్ద సినిమాలు వస్తాయనుకుంటే అవి వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 5 న వచ్చిన ఘాటీ, మదరాసి రెండూ ఉసూరుమనిపించాయి. ఇక ఇప్పుడు బాక్సాఫీసు భారమంతా.. తేజ సజ్జా మిరాయ్ మీదే ఉంది.
సెప్టెంబర్ 12 న తేజ సజ్జ మిరాయ్, బెల్లంకొండ కిష్కిందపూరి చిత్రాలు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం తేజ సజ్జ మిరాయ్ పై చాలా హోప్స్ ఉన్నాయ్. అటు హనుమాన్ సక్సెస్, ఇటు మిరాయ్ ప్రమోషనల్ ఈవెంట్స్ అన్ని సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మరి బోర్ కొడుతున్న బాక్సాఫీసుని మిరాయ్ అయినా ఉత్తేజ పరుస్తుందో.. లేదో చూడాలి.