మలయాళ హీరో-హీరోయిన్ ఫహద్ ఫాసిల్, నజ్రియా జంట విడిపోతుంది. అందుకే నజ్రియా డిప్రెషన్ లోకి వెళ్ళింది. ప్రేమించి పెళ్లాడి ఎంతో క్యూట్ గా కనిపించే ఈ జంట విడిపోవడమేమిటో అంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి వారి అభిమానులు చాలా బాధపడ్డారు. ఫహద్, నజ్రియా విడిపోకూడదు అంటూ వారు దేవుణ్ణి ప్రార్ధించారు.
తను వ్యక్తిగత సవాళ్లతో పోరాడుతున్నట్లు, ఈ కారణంగానే సోషల్ మీడియాకు, అభిమానులకు దూరంగా ఉన్నానని, ఈ భావోద్వేగ పోరాటంలో తనకు మద్దతుగా ఉన్న స్నేహితులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, సోషల్ మీడియాలో అందుబాటులో లేనందుకు క్షమాపణలు కోరుతూ నజ్రియా పోస్ట్ పెట్టడంతో ఆమె పర్సనల్ గా ఫాహద్ తో విడిపోవడం వలనే డిప్రెషన్ కి లోనైంది అనుకున్నారు అందరూ.
తాజాగా ఓనం ఫెస్టివల్ ని ఫహద్ ఫాసిల్, నజ్రియా కలిసి సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోస్ ను నజ్రియా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేసింది. భర్త ఫహద్ తో నజ్రియా చాలా సరదాగా, సంతోషంగా కనిపించింది. ఇంత చక్కగా కలిసున్న జంట పై ఈ విడాకుల రూమర్స్ క్రియేట్ చేసింది ఎవరో కానీ వారు నాశనమైపోవాలంటూ వారి అభిమానులు ఇప్పుడు శాపనార్ధాలు పెడుతున్నారు.