పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో క్రేజీ మాస్ డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కించబోయే స్పిరిట్ ఇంకా సెట్ పైకి వెళ్ళలేదు కానీ.. స్పిరిట్ గురించి ఏ చిన్న వార్త అయినా తెగ వైరల్ అవుతూ ఉంది. ప్రభాస్ డేట్స్ కోసం సందీప్ వంగా వెయిట్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటుగా నటుల ఎంపికను పూర్తి చేసుకున్న సందీప్ వంగ స్పిరిట్ విషయంలో చాలా క్లారిటీ గా ఉన్నారు.
ఎంత క్లారిటీ అంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా ప్రభాస్ ని స్పిరిట్ కోసం వాడేయ్యనున్నాడు. అందుకే ప్రభాస్ బల్క్ డేట్స్ సందీప్ వంగ తీసుకున్నాడు. అంతేకాదు స్పిరిట్ మ్యూజిక్ విషయంలో 70 శాతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేశాడట. తనకి ఎలాంటి BGM కావాలో కూడా క్రియేట్ చేసుకున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విత్ BGM తో ప్రభాస్ తో స్పిరిట్ షూట్ చేయాలనేది సందీప్ ఆలోచన.
మరి దీన్ని బట్టి స్పిరిట్ సెట్ పైకి వెళ్లిన ఏడాది కల్లా ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. షూటింగ్ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేసేలా సందీప్ వంగ ముందు నుంచే పక్కా క్లారిటీతో స్పిరిట్ తో జర్నీ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే సందీప్ వంగా ఎలాంటి హడావిడి లేకుండా సినిమాని పూర్తి చేసి అనుకున్న తేదికి స్పిరిట్ ని విడుదల చెయ్యడం మాత్రం పక్కాగానే కనిపిస్తుంది.