గత ఏడాది డిసెంబర్ లో తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని ని హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయంలో వివాహం చేసుకున్న మహానటి కీర్తి సురేష్ తన పెళ్లి తర్వాత వచ్చిన మొదటి ఓనం ఫెస్టివల్ ను చాలా గ్రాండ్ గా జరుపుకుంది. భర్త ఆంటోని తో కలిసి స్టైలిష్ గా వైట్ చీర కట్టి ఓనం పండుగను సెలెబ్రేట్ చేసుకుంది.
భర్త తో కలిసి రొమాంటిక్ గా ఫోటోలకు ఫోజులివ్వడమే కాదు ఫ్యామిలీ తో కలిసి గ్రూప్ ఫొటోస్ కు ఫోజులిచ్చిన కీర్తి సురేష్ తన పెట్స్ తోనూ ఓనం పండుగ సెలెబ్రేషన్స్ జరుపుకుంది. పెళ్లి తర్వాత వచ్చిన ఈ ఓనం పండుగను కీర్తి సురేష్ మాత్రం స్పెషల్ గా కాదు కాదు బ్యూటిఫుల్ గా సెలెబ్రేట్ చేసుకుంది.