అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కిన పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు పుష్ప 1 తో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకుని క్రేజీ అవతారమెత్తితే.. పుష్ప 2 తో అనేక అవార్డు లు అందుకుంటున్నాడు. రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ లో పుష్ప 2 అనేక అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ సైమా స్టేజ్ పై పుష్ప 3 ది ర్యాంపేజ్ ఉంటుందని చెప్పడం అల్లు ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తింది.
పుష్ప 1, పుష్ప 2 తో అల్లు అర్జున్ ఐదేళ్ల సమయం వృధా అయ్యింది అనే భావనలో ఉండడంతో సుకుమార్ తో ఇప్పుడప్పుడే పుష్ప 3 చేసే ఉద్దేశ్యం లేదు. అందుకే ఆయన కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీ తో AA 22 స్టార్ట్ చేసేసి షూటింగ్ స్పాట్ కి వెళ్లిపోయారు. పుష్ప ఫ్రాంచైజీతో ఎంతగా పేరొచ్చినా అల్లు అర్జున్ పుష్ప 3 సెట్ లోకి వెళ్లేందుకు ప్రస్తుతం సన్నద్ధంగా లేడు.
పుష్ప 2 రిలీజ్ అయ్యి ఏడాది గడుస్తున్నా సుకుమార్ తన మరో సినిమాపైకి వెళ్ళలేదు. రామ్ చరణ్ తో సుకుమార్ RC 17 చెయ్యాల్సి ఉంది. రామ్ చరణ్ మూవీ ఫినిష్ అయ్యాక సుకుమార్ పుష్ప 3 పైకి వచ్చినా అల్లు అర్జున్ ఏమంటాడో చూడాలి. ఎందుకంటే పుష్ప 3 తో మరో మూడేళ్ళ సమయం అల్లు అర్జున్ వృధా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు, అందుకే పుష్ప 3 మొదలయ్యాక మొదలైంది అని అనుకోవాలి అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.