రీసెంట్ గా కవిత కల్వకుంట్ల.. మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్యెల్యే, స్వయానా బావ హరీష్ రావు పై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి కారణం తన తండ్రి కాదు.. అంతా హరీష్ రావు చేశాడంటూ కవిత మీడియా మీట్ పెట్టి రచ్చ చేసింది. కవిత వ్యాఖ్యలపై హరీష్ రావు ఎలా స్పందిస్తాడో అని గత రెండు రోజులుగా అందరూ వెయిట్ చేస్తున్నారు.
అయితే హరీష్ రావు విదేశీ పర్యటన ముగించుకొని ఈరోజు శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగారు. అక్కడ ఎయిర్‌పోర్టులో హరీష్ రావు కవితపై సంచలనం వ్యాఖ్యలు చేసారు. కవిత ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా.. నాపై కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాపై చేసిన వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.
మొదటి నుంచి పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. నా 25ఏళ్ల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగుతున్నా. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికి తెలుసునని అన్న హరీష్ రావు తర్వాత నేరుగా కేసీఆర్ ను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు. అక్కడ కేటీఆర్, కెసిఆర్లతో హరీష్ రావు సమావేశమయ్యారు.