2013లో ఘటన ఇది. అప్పటికి రణబీర్, కత్రిన ఇద్దరికీ వారి భాగస్వాములతో పెళ్లి కాలేదు. ఆ సమయంలో రణబీర్- కత్రిన జంట ఘాడమైన ప్రేమలో ఉన్నారు. దీపికతో ప్రేమాయణం సాగిస్తూనే, రణబీర్ కత్రినతోను డేటింగ్ కొనసాగిస్తున్నాడని పుకార్లు వచ్చాయి. ఆ సమయంలోనే కత్రినతో అతడి ప్రయివేట్ లైఫ్ కు సంబంధించిన ఓ ఫోటో లీకవ్వడం ప్రకంపనాలు సృష్టించింది. ఆ ఇద్దరూ పూర్తి స్వేచ్ఛగా బీచ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒంటిపై దుస్తులు లేకుండా అర్థనగ్నంగా ఉన్నప్పుడు ఫోటోలు తీసి లీక్ చేసారు. కత్రినా బికినీలో కనిపించగా, రణబీర్ స్విమ్ షార్ట్స్ ధరించాడు. ఆ సమయంలో ఇద్దరూ తమ సంబంధాన్ని బహిరంగంగా ధృవీకరించకపోయినా, ఆ ఫోటోలతో ఊహాగానాలకు మరింతగా రెక్కలొచ్చాయి.
అయితే ఆ ఫోటోలు లీక్ చేసినది ఎవరు? ఈ ప్రశ్నకు ఇంతకాలంగా సమాధానం లేదు. ఇప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్ మానవ్ మంగ్లానీ ఆ ఫోటోలు టూరిస్ట్ ల ద్వారా లేదా స్టిల్ ఫోటోగ్రాఫర్ల ద్వారా లీక్ కాలేదని అభిప్రాయపడ్డారు. రణబీర్ లేదా కత్రినకు సన్నిహిత వ్యక్తి నుంచి ఇవి మీడియాకు లీక్ అయ్యాయని అన్నారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. చాలా బాలీవుడ్ ప్రేమకథలకు సంబంధించిన విషయాలను మానవ్ షేర్ చేసారు. సెలబ్రిటీలు అభ్యర్థించినా ఫోటోలను తొలగించడానికి తాను నిరాకరిస్తున్నానని, ఎందుకంటే ఫోటోలు ఏదోలాగా బయటకు వస్తాయని అన్నారు.
నిజానికి అలాంటి పరిస్థితులలో ఎవరైనా కొంచెం తారుమారుగా ఉండాలి! అని అన్నారు. ఆదిత్య రాయ్ కపూర్ - అనన్య పాండే డేటింగ్ చేస్తున్నప్పుడు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. దీపావళి పార్టీ నుండి బయటకు వస్తున్నప్పుడు విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ పై ఫోటోలు తీసిన మొదటి వ్యక్తి తానేనని కూడా పేర్కొన్నారు. ఫోటోలకు తాళం వేయలేమని కూడా ఆయన అన్నారు. అయితే కత్రిన- రణబీర్ జంట ప్రయివేట్ ఫోటోలు లీక్ చేసింది మీరేనా? అని పాడ్ కాస్టర్ ప్రశ్నించగా, ``అవును, అవి వారికి చాలా దగ్గర వ్యక్తి ద్వారా లీక్ అయ్యాయి`` అని సమాధానమిచ్చారు. అయితే ఆ ఫోటోలను ఎవరు లీక్ చేశారో తనకు తెలియదని ఆయన అన్నారు. అప్పటి నుండి ఆ తరహా లీక్‌లు ఏవీ జరగలేదని కూడా ఆయన పేర్కొన్నారు.
అయితే నాటి ఘటన అనంతరం కత్రిన, రణబీర్ వేర్వేరు ప్రకటనల్లో తమ నిరాశను వ్యక్తం చేసారు. సెలబ్రిటీల గోప్యతను గౌరవించాలని కత్రిన వ్యాఖ్యానించగా, సరిహద్దులు దాటకూడదని రణబీర్ మీడియాకు సూచించారు. అయితే ఇలాంటి ప్రయివేట్ ఫోటోల లీకుల వ్యవహారంలో కేవలం స్టిల్ ఫోటోగ్రాఫర్లను మాత్రమే నిందిస్తారు. కానీ నేటి అధునాతన సాంకేతిక వ్యవస్థలో ఎవరైనా ఎలాంటి ఫోటోలు అయినా లీక్ చేయొచ్చు. సన్నిహితుల నుంచి లీక్ కావని ఎవరైనా చెప్పగలరా? అని కూడా మానవ్ ప్రశ్నించారు.