ఇద్దరి భార్యలు ఉండడం నేరమేమి కాదు అన్నట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఇంట్లో భార్య వీధిలో ప్రియురాలు అన్నట్టుగా ఉంటారు. భార్యలను మోసం చేస్తూ వేరే మహిళలతో సంబంధాలు పెట్టుకుంటారు. భార్యలేమి తక్కువ కాదు ప్రియుడి కోసం భర్తలను హత్యలు చేయించే స్థితికి వెళ్లిపోయారు. భర్త మాత్రమే కాదు ప్రియుడు కూడా అన్న రేంజ్ లో మహిళలు తయారయ్యారు.
ఇప్పుడు ఇద్దరు భార్యలతో ఒకే ఇంట్లో ఉంటూ పోలీసులకు దిరికిపోయాడు జైలర్ నటుడు. జైలర్ చిత్రంలో నెగెటివ్ రోల్ లో కనిపించిన శరవణన్ ఇద్దరు భార్యలతో కలిసి ఒకే ఇంట్లో పోలీసులకు దొరకడం హాట్ టాపిక్ అయ్యింది. 2003లో సూర్యశ్రీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శరవణన్ ఆతర్వాత 2015 నుంచి ఓ మహిళా తో సహజీవనం సాగిస్తున్నాడు. ఆతర్వాత అంటే 2018 లో ఆ యువతి శ్రీదేవిని శరవణన్ రెండో వివాహం చేసుకున్నాడు.
మాంగాడు సమీపంలోని మౌలివాక్కంలో ఒకే భవనంలో మొదటి అంతస్తులో మొదటి భార్యతో, కింద అంతస్తులో రెండో భార్యతో శరవణన్ జీవిస్తున్నాడు. తాజాగా శరవణన్ మొదటి భార్య సూర్యశ్రీ తన భర్తపై హత్యా బెదిరింపు కేసు పెట్టింది. శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకున్న శరవణన్ ఆమెతో కలిసి తనని హత్యా బెదిరింపులు చేస్తూ హింసిస్తున్నారని ఆరోపించారు. దానితో పోలీసులు శరవణన్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.