ప్రస్తుతం కేసీఆర్-కవిత ఎపిసోడ్ లో హరీష్ రావు సైలెంట్ గా ఉన్నాడు. కవిత ఎక్కువగా హరీష్ రావు నే టార్గెట్ చేసి, తండ్రి, అన్నను డైరెక్ట్ గా అనకుండా నెపం మొత్తం, అవినీతి మరక ను హరీష్ రావు కి అంటించేసింది. రేవంత్ రెడ్డి-హరీష్ రావు ఒకే ఫ్లైట్ లో వెళ్లినప్పటి నుంచి నాపై కుట్ర జరుగుతుంది. రేవంత్ రెడ్డి-హరీష్ రావు కుమ్మక్కయ్యారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో తన తండ్రి కేసీఆర్ తప్పేమి లేదు.. మొత్తం హారిష్ రావే చేశాడంటూ ప్రెస్ మీట్ లో రచ్చ రచ్చ చేసింది.
కవిత ఆరోపణలపై హరీష్ రావు ఎలా రియాక్ట్ అవుతాడో అని తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అయితే కవిత ఎపిసోడ్ లో కేసీఆర్ రియాక్ట్ అవ్వకూండా కేటిఆర్ ను రంగంలోకి దించి ప్రెస్ మీట్ పెట్టించారు. ఆతర్వాత హరీష్ స్పందన కోసం యావత్ తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తుంటే.. హారిష్ రావు స్పందించకుండా ఉండడమే మేలు.
ఒకవేళ కవిత ఆరోపణలపై హరీష్ రావు రియాక్ట్ అయ్యి ఘాటుగా సమాధానం చెబితే కవిత ఇంకెన్ని పేర్లు బయటపెడుతుందో, బిఆర్ ఎస్ పార్టీ నేతల్లో ఎంతమంది పేర్లు కవిత నోటి వెంట వినాల్సి వస్తుంది వస్తుంది అని కొంతమంది, అసలు హరీష్ రావు తప్పు చెయ్యకపోతే కవిత తండ్రి కేసీఆర్ ని ఎదురించి అంతలాంటి కామెంట్లు చెయ్యదు, మొదటి నుంచి కవిత, కేటీఆర్, హరీష్ రావు లే కెసిఆర్ చుట్టూ ఉన్నారు. అందుకే కవిత హరీష్ రావు ను టార్గెట్ చేసింది. ఆమె దగ్గర ఇంకెన్ని ఆధారాలున్నాయో అంటూ మాట్లాడుకోవడం గమనార్హం..