సెప్టెంబర్ 5 శుక్రవారం పెద్ద సినిమాలైన అనుష్క ఘాటీ, శివ కార్తికేయన్ మదరాసి చిత్రాలతో పోటీపడి మరీ ఈటివి విన్ వారు చిన్న చిత్రమైన లిటిల్ హార్ట్స్ ను దించారు. బన్నీ వాస్, వంశి నందిపాటి లు లిటిల్ హార్ట్స్ ని థియేటర్స్ లో అందులోను ముందే ప్రీమియర్స్ గా వేసి ఆడియన్స్ మనసు గెలిచారు. ఘాటీ, మదరాసి చిత్రాలతో పోటీ పడి లిటిల్ హార్ట్స్ గెలిచింది. మొదటి రోజు ఓపెనింగ్స్ ఎలా ఉన్నా ఘాటీ, మదరాసి ల కంటే బెటర్ ఫిలిం గా లిటిల్ హార్ట్స్ ప్రూవ్ చేసుకుంది.
లిటిల్ హార్ట్స్ వీక్షించిన ఓ ప్రేక్షకుడి స్పందన ఇది..
నో కథ.. నో కాకరకాయ్.. ఓన్లీ ఎంజాయ్..
ప్యూర్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అని అడిగితే..
లిటిల్ హార్ట్స్ సినిమా చూపిస్తే సరిపోతుంది..
చూస్తున్నంత సేపు నవ్వుకుంటే చాలు అన్నట్టు ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు సాయి మార్తాండ్..
ఎక్కడా సీరియస్ నెస్ ఉండదు.. ఓన్లీ ఎంటర్టైన్మెంట్..
డైలాగ్స్ మీద వెళ్ళిపోతుంది సినిమా..
ఎపిసోడ్స్ వైజ్ గా కథ రాసుకున్నాడు దర్శకుడు సాయి..
అందులోనే కావాల్సినంత కామెడీ జనరేట్ చేశాడు..
కొన్ని హిలేరియస్ సీక్వెన్స్ లు ఉన్నాయి సినిమాలో..
మరీ ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఓ పాట ఎపిసోడ్ కడుపులు చెక్కలు చేసింది..
మౌళి అండ్ గ్యాంగ్ చేసిన అల్లరి బాగుంది..
లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది.. 2 గంటలు ఫాస్ట్ గా వెళ్ళిపోయింది..
మౌళి బాగున్నాడు.. బాగా చేశాడు కూడా..
శివాని నగరం పర్లేదు.. బానే చేసింది..
హీరో ప్రెండ్ క్యారెక్టర్ అదిరిపోయింది.. మనోడి పంచులు నెక్స్ట్ లెవెల్..
డైరెక్టర్ సాయి మార్తాండ్ తను అనుకున్న ఎంటర్ టైన్మెంట్ అందించాడు..
ఓవరాల్ గా లిటిల్ హార్ట్స్.. నో లాజిక్.. జస్ట్ ఎంజాయ్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ..!