ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ (91) గురువారం నాడు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ దిగ్గజాలు తమ సంతాపం తెలియజేసారు. డెమీ మూర్, జులియా రాబర్ట్స్ సహా పలువురు హాలీవుడ్ అగ్ర తారలు అర్మానీ కుటుంబానికి సంతాపం తెలియజేసారు. భారతదేశం నుంచి సోనమ్ కపూర్ కూడా ఈ ప్రముఖుడికి సంతాపం తెలియజేస్తూ ఒక అందమైన ఫోటోని షేర్ చేసారు.
లెజెండరీ అర్మానీ మల్టీ బిలియన్ డాలర్ వ్యాపార సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి ఇలా అంతర్థానం అవ్వడం ప్రపంచవ్యాప్తంగా విషాదం నింపింది. అర్మానీ గ్రూప్ సృష్టికర్త, వ్యవస్థాపకుడు, విరామం అన్నదే లేని మెచీన్ అర్మానీ మరణానికి ఫ్యాషన్ ప్రపంచం విస్తుపోయింది. ఈ శని ఆదివారాలు (6,7 తేదీలు) ఆయన బౌతిక ఖాయాన్ని అభిమానుల సందర్శన కోసం మిలన్‌లో ఉంచారు.
ఫోర్బ్స్ వివరాల ప్రకారం.. అర్మానీ నికర ఆస్తుల విలువ 12.1 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో సుమారు 10లక్షల కోట్లు. ఆయన తుది శ్వాస విడిచే వరకూ అలుపెరగని యోధుడిలా పని చేసారు. తన కంపెనీల వృద్ధి కోసం ఆయన నిరంతరం ఆలోచించారు. జార్జియో అర్మానీ యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీ.. అర్మానీ ఎంతో ఓర్పు ప్రణాళికతో దీనిని నిర్మించారు. తన సంస్థలో ప్రతి చిన్న ఉద్యోగితోను సత్సంబంధాలు కొనసాగించిన మేటి పారిశ్రామిక వేత్త ఆయన.