బాలీవుడ్ లో నేపో కిడ్స్ హవా గురించి చెప్పాల్సిన పని లేదు. షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్, సంజయ్ కపూర్ నటవారసురాలు సనాయా కపూర్, శ్రీదేవి-బోనీ జంట ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషి, చంకీ పాండే కుమార్తె అనన్య పాండే, సైఫ్ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్.. ఇటీవలి కాలంలో నేపోకిడ్స్ గా ఔట్ సైడర్స్ నుంచి ద్వేషాన్ని ఎదుర్కొంటున్నారు.
ఇదే బాటలో ఇప్పుడు బుల్లితెర నటి శ్వేతా తివారి కుమార్తె పాలక్ తివారీ కూడా నేపో కిడ్ అనే పిలుపందుకుని చాలా ట్రబుల్స్ ని ఎదుర్కొంటోంది. నటవారసురాలిగా కెరీర్ ఆరంభం అవకాశాలొచ్చినా కానీ, తనను తాను నిరూపించుకునేందుకు సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నానని, నటవారసురాలు అయినా తనకు సులువుగా అవకాశాలు దక్కడం లేదని కూడా పాలక్ ఆవేదన చెందింది.
అయితే ఔట్ సైడర్స్ నుంచి ఠఫ్ కాంపిటీషన్ ఎదుర్కొంటున్న నేపోకిడ్స్ కెరీర్ పరంగా ఎదిగేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇటీవల వరుస ఫోటోషూట్లతో నెటిజనులకు టచ్ లో ఉన్నారు. ఇతర భామల బాటలో పాలక్ కూడా ఫోటోషూట్లలో ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా పాలక్ తివారీ అల్ట్రా స్టైలిష్ గ్లామ్ షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. అందమైన డిజైనర్ ఫ్రాక్ లో ప్రత్యక్షమైన పాలక్ యువతరం మతులు చెడగొడుతోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతోంది.
పాలక్ తివారీ కెరీర్ సంగతులు చూస్తే, సల్మాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో నటించిన ఈ భామ ది భూత్నీ, రోమియో ఎస్ 3 అనే చిత్రాలలోను నటించింది. కానీ సోలో కథానాయికగా సరైన అవకాశం కోసం పాలక్ ఎదురు చూస్తోంది. బహుశా అలాంటి బంపరాఫర్ సౌత్ నుంచి లభిస్తుందని కూడా ఎదురు చూస్తున్నట్టే కనిపిస్తోంది. కానీ ఆ ఒక్క ఛాన్స్ ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.