ఈరోజు సెప్టెంబర్ 5 న అనుష్క ఘాటీ, శివ కార్తికేయన్ మదరాసి చిత్రాల నడుమ చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమా లిటిల్ హార్ట్స్. ఈ చిత్రం కంటెంట్ పై ఉన్న నమ్మకంతో ఒక రోజు ముందే మేకర్స్ పెయిడ్ ప్రీమియర్స్ వేసేసారు. స్టూడెంట్స్ కి ఫ్రీ టికెట్స్ పంచారు. హా చిన్న సినిమాలు థియేటర్స్ లో ఏం చూస్తాం, ఓటీటీలో చూడొచ్చు అనుకునేవారికి చిన్న సినిమాలే థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. పెద్ద సినిమాలు, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటూ ఎగబడినా ఫలితాలు తారుమారవుతున్నాయి.
ఇక పెయిడ్ ప్రిమెయిర్స్ గా లిటిల్ హార్ట్స్ ప్రేక్షకుల ముందుకు రాగా... ఈ చిత్రానికి అన్ని వైపులా నుంచి పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. చిన్న సినిమానే కదా అని నీరసంగా థియేటర్స్ లో అడుగుపెట్టిన ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ తో లిటిల్ హార్ట్స్ నటులు కట్టిపడేసారు. ఫస్ట్ హాఫ్ యూత్ ఫుల్ కామెడీగా కనిపిస్తే.. సెకండ్ హాఫ్ లో అసలు సిసలు కామెడీ ఆడియన్స్ ను కుర్చీల్లో నిలవనియ్యకుండా చేసింది. ఆద్యంతం నవ్వులతో ప్రేక్షకులు లిటిల్ హార్ట్స్ ని థియేటర్స్ లో ఎంజాయ్ చేసారు అంటే నమ్మాలి.
మౌళి, శివాని నాగారం ఇద్దరూ తమ తమ పాత్రలలో అద్భుతమైన నటన కనబరిచారు. ముఖ్యంగా మౌళి కామెడీ మాత్రం థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చెయ్యాల్సిందే. అంతేకాదు లిటిల్ హార్ట్స్ కి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ మెయిన్ హైలైట్స్ గా నిలిచాయి. లిటిల్ హార్ట్స్ కి మైనస్ అనేది చెప్పుకోవాలి అంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ తప్ప మరేది కనిపించదు. ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, వంశి లు ఈ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు చాలా కష్టపడ్డారు.