ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా అనుష్క నిలుస్తుంది. ఆమె అరుంధతి, భాగమతి లాంటి చిత్రాలతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఘాటీ నేడు సెప్టెంబర్ 5 న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ షోస్ కంప్లీట్ అవడంతో ఆడియన్స్ ఘాటీ సినిమాపై రియాక్ట్ అవుతూ ట్వీట్లు పెడుతున్నారు.
ఘాటీ ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. స్వీటీ అనుష్క మాస్ గా శీలావతి పాత్రలో చూపించిన పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే, క్రిష్ డైరెక్షన్, విక్రమ్ ప్రభు పెర్ఫార్మెన్స్, ఆయన స్క్రీన్ ప్రజెన్స్, అనుష్క యాక్టింగ్ అన్నీ ఘాటీ కి ప్లస్ పాయింట్స్.. అంటూ కొంతమంది ఆడియన్స్ ట్వీట్ చేస్తున్నారు.
అనుష్క తన కెరీర్‌లో వైల్డెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను చూపించింది, ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది. సినిమా మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. ఘాటీ కి మ్యుూజిక్ హైలెట్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ ఒకే అనిపిస్తుంది కానీ సెకెండ్ హాల్ఫ్ చాలా బాగుంది అంటూ మరో ఆడియెన్ ట్వీట్ చేసాడు. కాకపోతే అనుష్క వాయిస్ మ్యాచ్ అవ్వలేదు, వీఎఫెక్స్, స్క్రీన్ ప్లే విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సింది.
కొన్ని సీన్లు ల్యాగ్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా సినిమా గుడ్, అనుష్క వేసిన శీలావతి పాత్ర ఎప్పటికీ ప్రేక్షకులు గుర్తుంచుకొనేలా ఉంటుంది అంటూ మరికొంతమంది ఆడియన్స్ ఘాటీ ని చూసి ట్వీట్లు పెడుతున్నారు.