నందమూరి నటసింహ బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి కలయికలో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న అఖండ 2 చిత్రం సెప్టెంబర్ 25 నుంచి అధికారికంగా వాయిదా వేశారు మేకర్స్. ఓ పాట, సీజీ వర్క్ కంప్లీట్ అవ్వకపోవడంతో అఖండ 2 తాండవాన్ని వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది.
అయితే అఖండ 2 డిసెంబర్ 5 న రిలీజ్ అవ్వొచ్చనే ఊహాగానాల నడుమ ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. బాలయ్య మరోసారి సంక్రాంతి బరిలోకి రాబోతున్నారు. అచ్చొచ్చిన సంక్రాంతి సీజన్ కి బాలయ్య అఖండ 2 ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ మొదలైంది. ఈలోపు డిసెంబర్ రిలీజ్ హామీతో ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ ఓటీటీ డీల్ ఫినిష్ చేసింది అన్నారు.
తాజాగా బాలయ్య ఓ ఈవెంట్ లో అఖండ 2 రిలీజ్ తేదీని లీక్ చేసారు. డిసెంబర్ మొదటి వారంలో అఖండ తాండవం రిలీజ్ ఉంటుంది అంటూ అభిమానులకు సర్ ప్రైజ్ అప్ డేట్ ఇచ్చారు. బాలయ్య ఖచ్చితమైన డేట్ చెప్పలేదు కానీ.. మొదటివారం అంటే డిసెంబర్ 5 నే అఖండ 2 రిలీజ్ ఉంటుంది అంటూ బాలయ్య ఇలా క్లారిటీ ఇచ్చారని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు.