సంజయ్ లీలా భన్సాలీ `లవ్ అండ్ వార్` చిత్రాన్ని ప్రపంచ దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ సినిమా క్లైమాక్స్‌ను ఇటలీలోని సిసిలీలో చిత్రీకరిస్తారని తెలిసింది. రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ మధ్య ప్రేమ, యుద్ధం ఏమిటన్నది తెరపైనే చూడాలి.
ముంబైలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో భారీ షెడ్యూల్ సహా భారతదేశంలో దాదాపు 125 రోజుల షూటింగ్ పూర్తి చేసిన తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు విదేశాలకు వెళుతోంది. ఇండియా టుడే ప్రకారం...సంజయ్ లీలా భన్సాలీ లవ్ & వార్‌తో అంతర్జాతీయ మార్కెట్లలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. సిసిలీ నగరం అంతటా భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసారు. ఇది సినిమాకి అత్యంత గొప్ప షూట్‌లలో ఒకటి కాబోతోంది.
క్లైమాక్స్ ఆద్యంతం భావోద్వేగాలు, లవ్ మేకింగ్ అంశాలతో రక్తి కట్టిస్తుంది. లవ్ & వార్ క్లైమాక్స్ నాటకీయంగా ఉంటుంది. వార్ నేపథ్యంలో ప్రేమకథ ఆసక్తిని కలిగిస్తుంది. సిసిలీ అంతటా సుదీర్ఘమైన క్లైమాక్స్ సన్నివేశాన్ని చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నాడు. సిసిలీ నగరంలోని విభిన్న ప్రకృతి దృశ్యాలు తెరపై కనిపిస్తాయి. ఇతర పాత్రలతో ఒక పాట షూట్ కూడా చేస్తారు. దాదాపు ఒక నెల పాటు విదేశాలలో ఉంటాడు`` అని తెలిసింది. వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానున్న లవ్ అండ్ వార్ చిత్రం రాజ్ కపూర్ టైంలెస్ క్లాసిక్ సంగం నుండి ప్రేరణ పొందింది.