అమరన్ తో సూపర్ సక్సెస్ కొట్టిన శివ కార్తికేయన్ దర్శకుడు మురుగన్ తో జత కట్టాడు.. అనగానే అందరిలో ఎన్నో అనుమానాలు. కారణం మురుగదాస్ ఫామ్ లో లేకపోవడమే. వీరి కలయికలో తెరకెక్కిన మదరాసి నేడు సెప్టెంబర్ 5 న తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి. దానితో మూవీ లవర్స్ మదరాసి చిత్రం పై తమ తమ రివ్యూస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హడావిడి మొదలు పెట్టారు.
మదరాసి ఓవర్సీస్ టాక్ లోకి వెళితే..
మదరాసి సినిమాను శివ కార్తీకేయన్ తన పెర్ఫార్మెన్స్‌తో పీక్స్‌లోకి తీసుకెళ్లాడు. మురగదాస్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగున్నాయి, అనిరుధ్ బీజీఎం, శివకార్తికేయన్ యాక్టింగ్, విజువల్ క్వాలిటీ అన్ని అదుర్స్ అంటూ ఓ ఆడియెన్ ట్వీట్ చేసాడు. రొమాన్స్ సీన్లు అంతగా ఆకట్టుకోలేదు, సాంగ్స్ కూడా బాగాలేవు, విద్యుత్ జమ్వాల్ ఒకేగా పెర్ఫార్మ్ చేశాడు, ప్రీ ఇంటర్వెల్ సీన్ బాగుంది, ఇక సెకండాఫ్‌లో బీజూ మోహన్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది.. అంటూ మరో ఆడియెన్ ట్వీట్ వేసాడు.
కొన్ని పాత తరహా క్రింజ్ సీన్లు తప్పితే ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. మురుగదాస్ స్టైల్ ఆఫ్ స్క్రీన్‌ప్లేతో సినిమా నడుస్తోంది. లవ్, క్రైమ్, కామెడీ సన్నివేశాలు మెప్పించాయి. రుక్మిణి వసంత్ తన గ్లామర్‌తో అదరగొట్టింది.. అంటూ మరికొందరు ఆడియన్స్ స్పందించారు.
మురుగదాస్ మరోసారి డిజప్పాయింట్ చేసాడు. మదరాసి కథ, కథనాల పూర్తిగా నిరాశపరిచేలా ఉన్నాయి. ఓవర్ ద టాప్ ప్రజెంటేషన్, కేకలు, బిల్డప్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించేలా ఉన్నాయి. శివ కార్తికేయన్ కోసం మదరాసి ని ఓసారి వీక్షించవచ్చు అంటూ మరికొందరు ప్రేక్షకులు మదరాసి పై రియాక్ట్ అవుతున్నారు.
మరి ఓవరాల్ గా చూస్తే మదరాశికి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. మదరాసి అసలు కథ ఏమిటి అనేది మరికాసేపట్లో మదరాసి రివ్యూలో..