కమల్ హాసన్ నిర్మాణ సారథ్యంలో శివ కార్తికేయన్-సాయి పల్లవి కలయికలో వచ్చిన అమరన్ కేవలం తమిళనాటే కాదు విడుదలైన ప్రతి భాషలోనూ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించింది. అమరన్ హిట్ తో మరోసారి శివ కార్తికేయన్ స్టార్ లిస్ట్ లోకి ఎక్కాడు. ఇప్పుడు శివ కార్తికేయన్ డిజాస్టర్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో మదరాసి చిత్రం చేసాడు.
ఈ చిత్రం రేపు అంటే ఈ నెల 5 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే మదరాసి ని శివ కార్తికేయన్ అండ్ టీమ్ , దర్శకుడు మురుగదాస్ లు తెగ ప్రమోట్ చేస్తున్నారు. తెలుగులోనూ హైదరాబాద్ వచ్చి ఓ ఈవెంట్ చేసారు. అమరన్ క్రేజ్ అయితే మదరాసి కి కనిపించడం లేదు. టాలీవుడ్ లో మదరాసి పై ఇంట్రెస్ట్ ఏమాత్రం కానరావడం లేదు.
అయితే మదరాసి పై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కలగకపోవడానికి ప్రధాన కారణం.. మురుగదాస్ పై నమ్మకం పోవడమే అంటున్నారు. స్పైడర్ నుంచి మురుగదాస్ సినిమాలు అన్ని ప్లాప్ లిస్ట్ లోకి వెళుతున్నాయి. ఆయన గత చిత్రం సికిందర్ ఎంత దారుణమైన రిజల్ట్ తెచ్చుకుందో అందరూ చూసారు. ఆ కారణంగానే మదరాసి పై జనాల్లో ఆసక్తి కలగడం లేదు.. సినిమా విడుదలయ్యాక టాక్ బావుంటే విజయాన్ని ఎవరూ ఆపలేరు.. కానీ టాక్ తేడా కొడితేనే..
సెప్టెంబర్ 5 న తెలుగులో అనుష్క ఘాటీ, లిటిల్ హార్ట్స్ తో మదరాసి పోటీ పడుతుంది. మరి మదరాసి జాతకం ఏమిటి అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.